పరకాల: నూతనంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన పింగిళి శ్రీపాల్ రెడ్డిని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన వరంగల్ , ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి ( MLC Sripal Reddy ) విజయం సాధించడంతో ఆయనపై మరిన్ని బాధ్యతలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. పిఆర్టియు సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేసిన శ్రీపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు అండగా నిలవడం ఆయన పనితనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.