Numerology | ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ఎమోషనల్.. చిన్న విషయాలకే బోరున ఏడ్చేస్తారట!
Numerology | కొంతమంది ఎంత కష్టమొచ్చినా ధైర్యంగా ఉంటే.. కొంతమంది మాత్రం చిన్న చిన్న విషయాలకే బాధపడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే ఈ స్వభావానికి న్యూమరాలజీకి సంబంధం ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Numerology | కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంతటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు. కానీ కొంతమంది అలా ఉండరు. చాలా సెన్సిటివ్‌గా ఉండి చిన్న మాట అంటేనే తెగ ఫీలయిపోతారు. కనీళ్లు పెట్టుకుంటూ బోరున విలపిస్తారు. అయితే ఇలా వ్యక్తుల స్వభావంలో తేడాలకు న్యూమరాలజీ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంఖ్యా శాస్త్రం కారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు ధైర్యంగా ఉంటే.. కొంతమంది ఇట్టే భావోద్వేగానికి లోనవుతారని అంటున్నారు.
మూలాంకం 2
ఏ నెలలోనైనా 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 2గా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూలాంకంపై చంద్రుడి ప్రభావం ఉంటుంది. అందువల్ల వీరు ఎంతో మృదుస్వభావులు, సున్నిత హృదయులు అని చెబుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరులను మాటలను చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరైనా కఠినంగా మాట్లాడినా, పట్టించుకోనట్లుగా ప్రవర్తించినప్పటికీ తెగ బాధపడతారు. బయటకు తమ భావాలను ఎక్కువగా వ్యక్తం చేయకపోయినా.. లోలోపల మాత్రం ఎంతో కలత చెందుతారు. చిన్న విషయానికే పెద్దగా ఆలోచించడం, భావోద్వేగాలకు లోనవ్వడం వీరి స్వభావంలో భాగమని నిపుణులు చెబుతున్నారు.
మూలాంకం 6
ఏ నెలలోనైనా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా ఉంటుంది. ఈ మూలాంకానికి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందం, అనుబంధాలకు ప్రతీకగా భావించే శుక్రుడి ప్రభావంతో వీరు భావోద్వేగపరులుగా ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. మూలాంకం 6 కలిగిన వ్యక్తులు కుటుంబసభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామితో ఉన్న బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. ఇతరుల కోసం త్యాగాలు చేయడానికైనా సిద్ధపడతారు. ముఖ్యంగా తమ గౌరవానికి భంగం కలిగినా, సన్నిహితులు నిర్లక్ష్యం చేసినా భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేకపోతారు.
మూలాంకం 7
ఏ నెలలోనైనా 7, 16, 15వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 7గా పరిగణిస్తారు. ఈ మూలాంకంపై కేతు ప్రభావం ఉంటుందని నమ్మకం. మూలాంకం 7 గల వ్యక్తులు మౌనంగా, ఆలోచనాత్మకంగా కనిపిస్తారు. చాలామంది వీరిని కఠిన స్వభావం కలిగిన వారిగా భావించే అవకాశం ఉంటుంది. కానీ వాస్తవానికి వీరి మనసు ఎంతో సున్నితంగా ఉంటుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. అయితే తమ భావోద్వేగాలను అందరితో పంచుకోవడం వీరికి ఇష్టం ఉండదు. బాధ కలిగినా, మనస్తాపం వచ్చినా బయటకు చెప్పకుండా లోలోపలే బాధపుతుంటారు.
Read More:
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారట.. ఎందుకో తెలుసా?
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

