Numerology | అందం, తెలివితేటలు రెండూ ఒకే అమ్మాయిలో ఉంటే వారిని బ్యూటీ విత్ బ్రెయిన్‌గా పిలుస్తుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారి లక్షణాల ఆధారంగా వారిలోనూ ఈ బ్యూటీ విత్ బ్రెయిన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు. మూలాంకం 6 కలిగిన అమ్మాయిలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతోపాటు మంచి ఆలోచనా శక్తి, సృజనాత్మకత కలిగి ఉంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలోనైనా సరే 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి శుక్రుడు అధిపతి. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రడిని అందం, ప్రేమ, కళలు, విలాసవంతమైన జీవనానికి కారకుడిగా భావిస్తుంటారు. అందుకే మూలాంకం 6 కలిగిన అమ్మాయిలు సహజంగానే ఆకర్షణీయంగా ఉండటంతో పాటు చుట్టుపక్కల వారిపై ప్రత్యేక ముద్ర వేస్తారని చెబుతారు.
మూలాంకం 6 కలిగిన అమ్మాయిలు కేవలం రూపంతోనే కాకుండా తమ తెలివితేటలు, వ్యవహారశైలితో కూడా అందర్నీ ఆకట్టుకుంటారు. వీరు మాట్లాడే తీరు, ఆలోచించే విధానం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపు పొందుతారు. అందుకే వీరిని బ్యూటీ విత్ బ్రెయిన్‌గా అభివర్ణిస్తుంటారు.
మూలాంకం 6 కలిగిన వారిలో సృజనాత్మకత కూడా ఎక్కువగానే ఉంటుంది. సంగీతం, నృత్యం, ఫ్యాషన్, డిజైనింగ్, పెయింటింగ్ వంటి కళలపై కూడా వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఏ పనినైనా అందంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించే నైపుణ్యం వీరికి సహజసిద్ధంగానే ఉంటుంది. వీరు సృజనాత్మక రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Numeorlogy Beautywithbrain2
శుక్ర గ్రహ ప్రభావం వల్ల మూలాంకం 6 కలిగిన అమ్మాయిలకు అందమైన వస్తువులు, శుభ్రత, సౌకర్యవంతమైన జీవనం అంటే ఇష్టంగా ఉంటుందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇల్లు, కార్యాలయం లేదా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అందంగా ఉంచేందుకు వీరు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని తెలిపారు. విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌కు ఇష్టపడినా, దానికోసం కష్టపడటానికి కూడా వెనుకాడరని సంఖ్యాశాస్త్రం పేర్కొంటోంది. ఈ మూలాంకం 6 గల అమ్మాయిలు కుటుంబం, బంధాలు, స్నేహాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. తమకు ఇష్టమైన వ్యక్తుల కోసం ఏ స్థాయిలోనైనా నిలబేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో మంచి అనుబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే వీరిలో ఒక బలహీనత కూడా ఉందని న్యూమరాలజీ నిపుణులు తెలిపారు. ఈ మూలాంకం కలిగిన అమ్మాయిలు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు. కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనైనా.. తమ ప్రశాంత స్వభావం, తెలివితో సమస్యలను అధిగమించగలరు. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. శుక్రుడి ప్రభావం మూలాంకం 6 కలిగిన అమ్మాయిలను ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా, తెలివిగా తీర్చిదిద్దుతుందని న్యూమరాలజీ నిపుణులు విశ్వసిస్తారు. అందుకే వీరు ఎక్కడికి వెళ్లినా తమ వ్యక్తిత్వం, ప్రతిభ, వ్యవహార శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారని అంటుంటారు.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!