Numerolgoy | పెళ్లిపై ఆడపిల్లలకు ఎన్నెన్నో కలలు ఉంటాయి. భర్తతో బంగారు జీవితాన్ని ఊహించుకుంటుంటారు. అదే సమయంలో తన జీవితంలోకి వచ్చిన మగాడు తనను ఎలా చూసుకుంటాడు? సంతోషపెడతాడా? కష్టపెడతాడా? అనే భయాలు కూడా వారిని వెంటాడుతుంటాయి. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఓ వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా అతని వ్యక్తిత్వం పెళ్లి తర్వాత భార్యతో ఎలా ఉంటాడు? తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి మూలాంకం 1 నుంచి 9 వరకు గల భర్తల స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా 1, 10, 19, 28వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 1గా ఉంటుంది. ఈ మూలాంకానికి సూర్యుడిని అధిపతిగా భావిస్తారు. ఈ సంఖ్యకు చెందిన పురుషులు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. పెళ్లి తర్వాత భార్య పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబాన్ని క్రమశిక్షణతో నడిపించేందుకు ప్రయత్ని్స్తారు. భార్యకు గౌరవం ఇవ్వడం, ఆమె సంతోషం కోసం ప్రయత్నించడం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారని అంటున్నారు.
సాధారణంగా 2, 11, 20, 29వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 2గా ఉంటుంది. ఈ మూలాంకం వారిపై చంద్రుని ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు భావోద్వేగపరులు, సున్నిత మనస్తతం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు భార్య భావాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. ప్రేమను మాటల కంటే కూడా తమ ఆప్యాయత, కేరింగ్ ద్వారానే ఎక్కువగా వ్యక్తపరుస్తారు.
సాధారణంగా 3, 12, 21, 30వ తేదీల్లో పుట్టిన పురుషులపై బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుషులు ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు. భార్యను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేస్తుంటారు. తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడంలో ఏ మాత్రం వెనుకడారు. కుటుంబంలో సానుకూల వాతావరణం కొనసాగేందుకు కృషి చేస్తుంటారు.
సాధారణంగా 4, 13, 22, 31వ తేదీల్లో పుట్టిన పురుషుల మూలాంకం 4గా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన పురుషులు ఆచరణాత్మకంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. భార్య పట్ల నిజాయితీగా, నమ్మకంగా వ్యవహరించడం వీరి ప్రధాన లక్షణం. కుటుంబానికి అండగా నిలబడటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు.
సాధారణంగా 5, 14, 23వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 5గా ఉంటుంది. బుధుడి ప్రభావం ఉన్న ఈ పురుషులు ఉత్సాహంగా, సరదా స్వభావం కలిగి ఉంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. భార్యను ఫ్రెండ్‌లా భావించి ప్రతి విషయాన్ని ఓపెన్‌గా చెప్పుకునేందుకు ఇష్టపడతారు. ఆమె అభిప్రాయాలను గౌరవించడం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వడం వీరి ప్రత్యేకత, భార్య కలలు నెరవేర్చడంలో, వారి కెరీర్‌ను బిల్డ్ చేయడంలో పూర్తి మద్దతు ఇస్తారు.
సాధారణంగా 6, 15, 24వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 6గా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన పురుషులు శుక్రుడి ప్రభావంతో ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపించే స్వభావం కలిగి ఉంటారు. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. భార్యను ప్రత్యేక చూసుకోవడం, చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వడం, ప్రేమతో మురిపించడం వీరి లక్షణాలు, ఇంట్లో ఆనందకర వాతావరణం ఉండేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తారు.
సాధారణంగా 7, 16, 25వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 7 గా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన పురుషులు లోతైన ఆలోచనలు, ఆధ్యాత్మిక దృక్పథం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరు ప్రేమను ఎక్కువగా మాటల్లో కాకుండా చేతల్లోనే చూపిస్తారు. నమ్మకం, పరస్పర గౌరవానికి ఎక్కువ విలువనిస్తారు.
సాధారణంగా 8, 17, 26వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 8గా ఉంటుంది. శని ప్రభావం ఉన్న ఈ పురుషులు బాధ్యతాయుతంగా, కష్టపడే స్వభావం కలిగి ఉంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. కుటుంబ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తారు. భార్య, పిల్లల సంతోషం కోసం ఎంత కష్టన్నైనా భరిస్తారు. ప్రేమను మాటల కంటే బాధ్యతల ద్వారా ఎక్కువగా వ్యక్తపరుస్తారు.
సాధారణంగా 9, 18, 27వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 9గా ఉంటుంది. కుజుడి ప్రభావం ఉన్న ఈ పురుషులు ధైర్యవంతులు, ఉదార స్వభావం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. భార్య పట్ల అంకితభావం ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమలో నిజాయితీ, నిస్వార్థత ఉంటాయి.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తను ఎక్కువగా ప్రేమిస్తారట..!