అదే సెంటిమెంట్ నిజమవుతుంది!
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు సినీరంగంలోకి అరంగేట్రం చేస్తున్నారు. అతనే ఘట్టమనేని జయకృష్ణ. దివంగత రమేష్‌బాబు తనయుడైన జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు సినీరంగంలోకి అరంగేట్రం చేస్తున్నారు. అతనే ఘట్టమనేని జయకృష్ణ. దివంగత రమేష్‌బాబు తనయుడైన జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషనల్డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌భూపతి దర్శకుడు. జూలై 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. తొలి చిత్రమైనా హీరో జయకృష్ణ చక్కటి పరిణతితో కూడిన నటనను కనబరిచాడని, పోరాట ఘట్టాలు మొదలుకొని, డైలాగ్ డెలివరీ వరకూ ప్రతీ విషయంలో పరిపక్వత ప్రదర్శించాడని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తున్నది.
ముఖ్యంగా జయకృష్ణ లుక్స్ అచ్చం మహేష్బాబులాగానే ఉన్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారని, ‘ఒక్కడు’ టైంలో మహేష్‌బాబు డైనమిక్ స్క్రీన్ ప్రజెన్స్ ఇప్పుడు జయకృష్ణలో కూడా కనిపిస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అగ్ర నిర్మాత అశ్వనీదత్ పరిచయం చేసిన మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి హీరోలు తారాపథంలో అగ్రస్థానానికి దూసుకెళ్లారని, ఇప్పుడు అదే సెంటిమెంట్ జయకృష్ణ విషయంలో కూడా నిజమవుతుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సమర్పణ: అశ్వనీదత్, రచన-దర్శకత్వం: అజయ్‌భూపతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

