ఐనవోలు,( హనుమకొండ): ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి పిలుపు నిచ్చారు. ఐనవోలుమండలంలోని ఒంటిమామిడిపల్లి హమాలీ వర్కర్స్ తో కలిసి మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న వెయ్యి స్తంభాల గుడి నుంచి ర్యాలీ ప్రారంభమై టీఎన్జీవోస్ భవన్ అలంకార్ జంక్షన్లో జరిగే మహాసభకు హమాలి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయపప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దద్దు రాజు, గోనె మల్లయ్య, బరిగెల శ్రావణ్, కోల సుధాకర్, నక్క మల్లేష్, రాజారపు కుమార్, బరిగెల సందీప్, శ్రీకాంత్, జక్కుల రాజు, బరిగెల వంశీ తదితరులు పాల్గొన్నారు.