Khila Warangal | ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో విద్యకు ప్రాధాన్యత : బోగి సువర్ణ
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ తెలిపారు.
ఖిలా వరంగల్, మార్చి 16: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ తెలిపారు. సోమవారం తూర్పు కోట అంగన్ కేంద్రాల్లో పిల్లలు, తల్లులు, గర్భిణీలకు 99 రోజుల ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ చిన్నారుల నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గర్భిణులకు పోషకాహారం అందించడం, చిన్నారులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తూ పాఠశాల అలవాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
అలాగే ఆటలు, పాటలు, బొమ్మలతో పిల్లల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి పాఠశాలలు, కాలేజీలు, ఉన్నత విద్య వరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతూ చివరకు యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగం బడి ప్రధానోపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయులు స్వర్ణ, వహీదా, శోభ, రాజమణి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

