న్యూశాయంపేట, ఏప్రిల్ 6: భట్రాజు కుల సంఘ అభివృద్ధికి సంఘ సభ్యులు అందరూ సహకరించాలని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు బిరుదురాజు రఘురామరాజు కోరారు. నగరంలో జిల్లా భట్రాజు కుల సంఘం ఎన్నికలు సోమవారం జరిగాయి. ఈ కుల సంఘం ఎన్నికకు ఎన్నికల అధికారులుగా సి.వి. జయవీర్రాజు, మహేందర్‌రాజు వ్యవహరించారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా బిరుదురాజు రఘురామరాజు, ప్రధానకార్యదర్శిగా ఏ శ్రీధర్‌రాజు, కోశాధికారిగా బి ఆనంద్గజపతిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 21 మంది సభ్యులతో పూర్తి కమిటీని ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యుల చేత ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
గతంలో పనిచేసిన సంఘ సభ్యులు చేసినా కార్యక్రమాలు, గత మూడు సంవత్సర ఆర్థిక లావదేవీలకు సంబంధించిన నివేదికను గతంలోని కార్యదర్శి పుస్తక రూపంలో ప్రతి ఒక్కరికి అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా జిల్లా ఎన్నికైనా అధ్యక్షుడు మాట్లాడుతూ కుల సంఘం ఆర్థికంగా బలోపితం చేసేందుకు కృషి చేస్తానన్నారు. సభ్యుల కష్ట సుఖాలలో సంఘం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సంఘ సభ్యులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భట్రాజు కుల బంధువులు, తదితరులు పాల్గొన్నారు.