Saurav Das | సుమారు రెండు నెలల్లోనే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భారతదేశంతో పాటు పొరుగు దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే, స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్, పాలసీ స్ట్రాటజిస్ట్ అశుతోష్ రాంకా, లాయర్ రత్నా సింగ్‌లు కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే వీరిలో సౌరవ్ దాస్ తన స్పీచ్‌లతోనే కాకుండా ఇటీవలి వివాదాల ద్వారా కూడా ప్రజల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.
ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా..
సౌరవ్ దాస్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA)లో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివారు. అమైటీ యూనివర్సిటీ నుంచి 2016-19లో పట్టా అందుకున్నారు. ఆయన ఆ సమయంలో 2018, డిసెంబర్ నుంచి 2029, జనవరి వరకు ప్రముఖ మీడియా సంస్థలో న్యూస్ డెస్క్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. దీంతో ప్రాథమిక అనుభవం పొందారు. డిగ్రీ పూర్తయిన తర్వాత 2020 నుంచి స్వతంత్ర జర్నలిస్టుగా పని చేస్తూనే 2021-22 లో పోస్ట్ వీడియో ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అనంతరం 2022-23లో GLG (Gerson Lehrman Group)లో కంటెంట్ అసోసియేట్‌గా పని చేశారు. ఈ విషయాలను తన లింక్డ్ ఇన్ ఖాతాలో వెల్లడించారు.
సొంత వెబ్సైట్
సౌరవ్‌దాస్.ఇన్ అనే సొంత వెబ్‌సైట్‌ను కూడా నడుపుతున్నారు. దీనిలో ఆయన సేకరించిన వార్తలు, అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. అలాగే అనేక వ్యాసాలు కూడా రాశారు. సీజేపీ ఉద్యమంతో సౌరవ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఏడు లక్షలు దాటింది. అదేవిధంగా ‘X’ ఖాతాలో కూడా ఆయనను లక్షా అరవైరెండు వేల మంది ఫాలో అవుతున్నారు.