ధర్మసాగర్ మే 30 : వికాస్ కృషి సంకల్ప అభియాన్‌పై రైతులకు అవగాహన సదస్సు శుక్రవారం ధర్మసాగర్ మండలం మలకపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కె వి కె మామ్నూర్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న హాజరై మాట్లాడారు. ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ అధిక లాభాలు పొందాలన్నారు. డాక్టర్ సురేష్ వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారుఎ. రైతులు ఒకే పంట బదులుగా వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు.
వరి, మొక్కజొన్న పత్తితో పాటుగా వివిధ రకాల నూనె గింజల పంటలు ఆముదం, నువ్వులు, కుసుమ పప్పు దినుసులను సాగు చేసుకోవాలన్నారు. సస్యరక్షణకు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రిక కారకాలను వినియోగించడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు.ఈ కార్యక్రమంలో సురేష్, సాయికిరణ్, ఎఈఓ కల్యాణ్, ఎంపీటీసీ కరుణాకర్, గ్రామ కార్యదర్శి అనుపమ, విజయ డెయిరీ సూపర్వైజర్ రఘు, శోభ, పశు వైద్య సహచరులు ఎల్లారెడ్డి పాల్గొనన్నారు.