హనుమకొండ చౌరస్తా, జులై 10: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ జూలై -2025 సెషన్‌కు సంబంధించిన నూతన ప్రవేశాలలో వివిధ మాస్టర్, బ్యాచిలర్ డిగ్రీ, పి.జి. డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రాంలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో హైదరాబాద్ రీజనల్ సెంటర్ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బోళ్ల రాజు, లాల్ బహదూర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ, ఇగ్నో స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఎస్వీ రమణారెడ్డి తెలిపారు.
గురువారం హనుమకొండలోని ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షల నిర్వహణ తీరును రాజు పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త ప్రవేశాల కోసం అభ్యర్థులు జూలై 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు, 98493 81085 నెంబర్లో లేదా www.ignou.ac.in వెబ్సైట్ చూడాలని కోరారు.