హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19 : హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌కాలేజీ బీఏ(హెచ్ఈపీ) మొదటి సంవత్సరం అభ్యసిస్తున్న జి.దినేష్ జాతీయస్థాయి ఖోఖో జట్టుకు ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అన్నారు. భారత ఖోఖో సమాఖ్య తెలంగాణ రాష్ర్టం తరఫున దినేష్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు ఈనెల 17 నుంచి 9 మార్చి వరకు గుజరాత్ రాష్ర్ట రాజధాని గాంధీనగర్‌లో భారత క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతులైన క్రీడాకారులతో కలిసి ఉన్నతస్థాయి సాధన చేయనున్నట్లు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకులు ఏటిబిటి ప్రసాద్, గిరిప్రసాద్, ప్రసాద్, క్రీడావిభాగం సిబ్బంది, సహ విద్యార్థులు దినేష్‌కు అభినందనలు తెలిపారు. జాతీయశిక్షణ శిబిరంలో విశిష్టప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.