హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 10: ఈనెల 11 నుంచి 15 వరకు తమిళనాడు అన్నా యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బాల్‌బ్యాడ్మింటన్(ఉమెన్స్) కాకతీయ యూనివర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి ఏ.వెంకయ్య తెలిపారు.
ఇందులో బొల్లికుంట వాగ్దేవి కాలేజీ నుంచి ఈ.జ్ఞానంకిత, ఎం.నిఖిత, ఖమ్మం యూసీపీఈ నుంచి పి.అమూల్య, ఏ.సంధ్యారాణి, పింగిళి డిగ్రీ కాలేజీ నుంచి ఎం.శ్రావ్యశ్రీ, కేయూ యూసీపీఈ నుంచి ఎం.పరిమల, మహబూబాబాద్ టీజీటీడబ్ల్యూఆర్డీసీ నుంచి జే.ప్రవళిక, హనుమకొండ జాగృతి మహిళా డిగ్రీ కాలేజీ నుంచి ఎం.శ్రీజ, బొల్లికుంట వాగ్దేవి కాలేజీ నుంచి ఆర్.శ్రావిక, ఈ.రేణుక ఉన్నారు. వీరికి బొల్లికుంట వాగ్దేవి కాలేజీ పీడీ కె.శ్రీకాంత్ కోచ్-కమ్-మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.