హనుమకొండ (ఐనవోలు): పట్టుదలతో తల్లిదండ్రులు ముందు సాగితే ఒంటిమామిడిపల్లి పాఠశాలగా తీర్చిదిద్దుకోవచ్చునని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి (Akunuri Murali) అన్నారు. ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాలను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ మేరకు ఒంటిమామిడిపల్లి పాఠశాల పేరెంట్స్ కమిటీ పాత, కొత్త కమిటి చైర్మన్ల, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, బాలవికాస ప్రతినిధులతో పాఠశాల పురోగతి సాధించిన తీరు, పురోగతి సాధించడానికి తీసుకున్న నిర్ణయాలు, అమలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ క్లాస్ రూంలను మురళీ, ఆరుట్ల కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ పొన్నాల రాజు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెండ్లి నవీన్, బాలవికాస ప్రతినిధి తిరుపతిరెడ్డి, హెచ్ఎం సదానందం మాట్లాడుతూ మూత పడిన పాఠశాలను 2015 పునర్ ప్రారంభించినప్పటి నుంచి నోఆడ్మిషన్స్ బోర్టు ఏర్పాటు చేసే స్థాయికి ఎలా వచ్చిందన్న విషయాలను క్లూప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సహకారం ఉంటే ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేసుకోవచ్చన్నారు. ఒంటిమామిడిపల్లి పాఠశాల పేరెంట్స్, కమిటి సభ్యులు, ఉపాధ్యాయులు పనితీరు అభినందనీయామన్నారు. పాఠశాల బలోపేతానికి ముందు నుంచి మద్దతునిచ్చిన బాలవికాస సంస్థలను అభినందించారు. ఒంటిమామిడిపల్లి పాఠశాలలో కొంత మేరకు టాయిలెట్స్, తరగతి గదులు, ఆట స్థలం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటికికి సంబంధించిన అంశాల పరిష్కరం కోసం కలెక్టర్ విజిట్ చేసే విధంగా సిఫారులు చేస్తున్నట్లుగా తెలిపారు. అదే విధంగా పాఠశాలకు ఒక పూల్ టైమ్ ఉండి వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒంటిమామిడిపల్లి పాఠశాలలో ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయులే సరిపోను ఉన్నారు. ప్రైవేట్ టీచర్ల అవసరం లేదు. ప్రైవేట్ టీచర్లు లేకపోతే తల్లిదండ్రుల మీద భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు పేరెంట్స్ కమిటీ సభ్యులు గెజిటెడ్ హెచ్ఎం, పీఈటీ, క్రాప్ట్ టీచర్లు, అదనపు తరగతి గదులు కేటాయించాలని కోరుతూ మురళికి వినతి ప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆనందం, అమ్మ ఆదర్శ కమిటి చైర్మన్ సకినాబి, పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ రాజు, సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.