పింగిళి కాలేజీ, ప్రభుత్వ వారసత్వ శాఖల మధ్య ఒప్పందం
తెలంగాణ ప్రభుత్వం వారసత్వ శాఖ, పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్, హనుమకొండ చరిత్ర విభాగం మధ్య బుధవారం హైదరాబాద్‌లో వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు ఆఫీసులో అవగాహన ఒప్పందం కుదిరిందని కాలేజీ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 12 : తెలంగాణ ప్రభుత్వం వారసత్వ శాఖ, పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్, హనుమకొండ చరిత్ర విభాగం మధ్య బుధవారం హైదరాబాద్‌లో వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు ఆఫీసులో అవగాహన ఒప్పందం కుదిరిందని కాలేజీ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి తెలిపారు. వారసత్వ స్థలాల సంరక్షణ, పురావస్తు అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం, పరిశోధన, ప్రాయోగిక శిక్షణకు అవకాశాలు కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులను వారసత్వ స్థలాల సందర్శనలు, పరిశోధన కార్యక్రమాలు, శిక్షణ, సదస్సులు, ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు.
వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు మాట్లాడుతూ పింగళి కళాశాల చరిత్ర విభాగం విద్యార్థినులు వారసత్వ, పురావస్తు అధ్యయనాలపై ఆసక్తి చూపుతున్నారని, విద్యార్థులకు శిక్షణ, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మ్యూజియంల సందర్శనలు, సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం, పరిశోధనా నైపుణ్యాలు పెరగడంతో పాటు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు విద్యాసంస్థల భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఒప్పందం సంతకం చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందన్నారు. చరిత్ర విభాగాధిపతి కొలిపాక శ్రీనివాస్, ఐక్యూఏసీ సమన్వయకర్త సురేష్‌బాబు, యూజీసీ సెల్ సమన్వయకర్త బాలరాజు, వారసత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, మల్లు నాయక్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

