కాజీపేట, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర పున ర్విభజన చట్టంలో రైల్వేపరంగా జిల్లాకు కేంద్ర ప్ర భుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాజ్యస భ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో అక్టోబర్ 5న, ఢిల్లీలో రైల్వే మంత్రితో అక్టోబర్ 30న జరిగే స మావేశంలో కాజీపేట రైల్వే సమస్యలను విన్నవిం చేందుకు కాజీపేట రైల్వే జంక్షన్‌కు శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. స్థానిక రైల్వే అధికా రులు, ప్రయాణికుల నుంచి పలు సమస్యలపై ఆరా తీరారు. రైల్వే స్టేషన్లో జరుగుతున్న లిఫ్ట్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న కాజీ పేట జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా గుర్తించాలని డిమాండ్‌కు ఒత్తిడి చేస్తానని చెప్పారు. కాజీపేట రైల్వే జంక్షన్లో మరో రెండు ప్లాట్‌ఫాంలు, కొత్త రైళ్ల ఏర్పాటు, నిజాం కాలంలో నిర్మించిన స్టేషన్, యార్డు అభివృద్ధి, ప్రయాణికుల అవసరాలు, పలు నూతన రైళ్ల ప్రారంభం, నిలుపుదల తదితర సమస్యలను సమావేశంలో చర్చించనున్నట్లు తెలి పారు. తెలంగాణ రాష్ట్రంలో మణుగూరు నుంచి భూపాలపల్లి మీదుగా మంచిర్యాలకు, భూపాల పల్లి నుంచి హసన్‌పర్తి రోడ్ వరకు, హసన్‌పర్తి రోడ్ స్టేషన్ నుంచి కరీంనగర్‌కు కొత్త రైలు మార్గం కోసం సమావేశంలో ఒత్తిడి చేస్తానని తెలిపారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో మూతపడిన రైల్వే పాఠశాలలో కేంద్రియ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా నన్నారు. ఆయన వెంట రైల్వే డివిజన్ పోరాట సమితి నాయకులు కర్ర యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, సుంచు అశోక్, రైల్వే నాయకులు తదితరులు ఉన్నారు.