వరంగల్, మార్చి 24 : భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరిపిన అనంతరం అమ్మవారికి లక్ష కనకాంబరాలతో పుష్పార్చనను ప్రధాన అర్చకులు నిర్వహించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్-రేవతి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు స్వాగతం పలికారు. ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, ఉద్యోగులు హరినాథ్, కృష్ణ, శ్యాంసుందర్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.