హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 12: హనుమకొండలోని ప్రభుత్వ ఐటీఐలో వాక్-ఇన్-అడ్మిషన్లు ఈనెల 28 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, కనీస వయస్సు 1-8-25 నాటికి 14 సంవత్సరాలు కలిగి ఉండాలన్నారు. వాక్-ఇన్ ద్వారా ప్రవేశం పొందాలంటే ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. మొదటి, రెండో దశలలో ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ దరఖాస్తు చేసుకొనే అవసరం లేదని నేరుగా వాక్-ఇన్ ద్వారా సీట్ల కోసం అర్హులే, కొత్తవారు మాత్రం ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అభ్యర్థులు హనుమకొండలోని ప్రభుత్వ ఐటీఐలో నేరుగా హాజరై సీటు పొందవచ్చని తెలిపారు.
సీట్ల ఖాళీల వివరాలు ప్రతి ఉదయం వెబ్సైట్లో అప్డేట్ అవుతాయని, ఒకసారి కోర్సు ట్రేడ్లో ప్రవేశం పొందిన తర్వాత మార్పు చేసే అవకాశం ఉండదని, సీట్ల కేటాయింపు కామన్ మెరిట్ ద్వారా దరఖాస్తు సమయం ఆధారంగా ఉంటుందని, అన్ని ఒరిజినల్ ధ్రువ పత్రాలను స్కాన్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ఫ్రెష్ అభ్యర్థులకు అడ్మిషన్ షెడ్యూల్ వాక్-ఇన్ అడ్మిషన్లో 28వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ 28న మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే ఉంటుందని ప్రిన్సిపాల్ సక్రు తెలిపారు.