హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 22: ప్రజల్లో ఆదరణ, పలుకుబడిలేని నాయకులు వారంటీ లేని పార్టీ, గ్యారంటీ లేని ఆరు పథకాలతో ముందుకు వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్క ర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వేయిస్తంభాల గుడిలో ఆదివా రం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రోడ్డుపై బండి దగ్గర టిఫిన్ చేసి, వివిధ కాలనీల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ విసృ్తత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ చారిత్రక నగరానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మరోసారి బీఆర్ఎస్ పార్టీ పై, సీఎం కేసీఆర్‌పై అనేక ఆరోపణలు, పసలేని, పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయినప్పటి నుంచి అభ్యర్థులే ప్రకటించ లేని నిస్సాయస్థితిలో కాంగ్రెస్, బీజేపీ ఉందన్నారు. కాంగ్రెస్ పెట్టిన ఏ ఒక సభ కూడా సక్సెస్ కాలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లా నుంచి ఒక్కో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడుతున్నారని, ఎన్నికలు వచ్చినప్పుడే వారికి ఇవన్నీ గుర్తుకొస్తాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ, అంబేదర్ ఆలోచన విధానాన్ని అవలంబిస్తున్నారన్నారు. దేశంలోనే ఎకడాలేని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ముందుకు తీసుకెళుతున్నారన్నారు. అబద్దాల హామీలతోని ప్రతి ఎన్నికల్లో ముందుకు వస్తున్న ప్రతి పక్ష నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్‌లాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సీట్లు కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉందని వినయ్‌భాస్కర్ అన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, నయీమొద్దీన్, పేర్ల మనోహర్, కోన శ్రీకర్, రావుల సుదర్శన్