బచ్చన్నపేట మే 14 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని జిల్లా నాయకులు జంగిడి విద్యానాధ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సన్నాహక సమావేశం మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన నిరుపేదలకు కచ్చితంగా ఈ పథకం వర్తించేలా చూడాలని మండల సీనియర్ నాయకులు నాయకులు సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అలసత్వానికి చోటు లేదని, బంధుప్రీతికి అవకాశం లేదన్నారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్లగొని బాలకిషన్ గౌడ్, అల్వాల ఎల్లయ్య, కొడవటూరు దేవస్థాన కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కోడూరి మహాత్మా చారి మాజీ సర్పంచులు గిద్దెల రమేష్, మాసపేట రవీందర్ రెడ్డి, మేకల కవిత రాజు, వెంకట్ గౌడ్ దేవస్థానం డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, బడుకోలు శ్రీనివాస్ రెడ్డి, పిన్నింటి బాపురెడ్డి, భూపాల్, ఆనందం, బాలరాజు, రమేష్, కరుణాకర్ పాల్గొన్నారు.