సుబేదారి, జూన్ 2 : ఈ నెల 4న లోక్సభ ఓట్ల కౌంటింగ్ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఎనుమాముల మార్కెట్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశామని, ముగ్గురు డీసీపీలు, పది మంది ఏసీపీలు, 29 మంది సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది, సాంకేతిక సిబ్బంది విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఊరేగింపులు, సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.