నల్లబెల్లి/ నర్సంపేట, ఏప్రిల్ : రజతోత్సవ సభకు దండుగట్టి దర్జాగా బయలుదేరుదామని నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ అన్నారు. ఈ నెల 27న ఎల్కత్తుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి నర్సంపేట మున్సిపాలిటీ 16, 22 వ వార్డుల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజతోత్సవ మహాసభకు గడప గడప నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు.
అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్టీయూ అధ్యక్షుడు గోనే యువరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ బండి ప్రవీణ్ , మండల శ్రీనివాస్, పెండెం వెంకటేశ్వర్లు, వాసం సాంబయ్య , పుల్లూరి స్వామి గౌడ్ 16 వార్డు అధ్యక్షుడు మడికొండ నరేందర్ పట్టణ నాయకులు రాయరాకుల సారంగం, కొమ్ముల కర్ణాకర్, మంద ప్రకాష్, మాదాసి సదానందం మహిళా నాయకురాలు స్వరూప, అశోక్, సంగేపు రాజేశ్వర్, సంగేపు సారంగం సంగేపు రమేష్ జన్ను సంజీవ, గోపి, శ్రీకాంత్, తాబేటి రాజేందర్, సుందరగిరి క్రాంతి, శివరాం,అరవింద్ తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.