పోచమ్మమైదాన్, ఏప్రిల్ 5 : ఓరుగల్లు కు చెందిన ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళికి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించా రు. అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఇండియా (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఈ ఏడాది అందించే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించేందుకు కార్యవర్గం నిర్ణయించినట్లు సంస్థ అధ్యక్షుడు శిరోమణి, డాక్టర్ వంశీ రామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు.
ప్రముఖ విలక్షణ అభ్యుదయ రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి పేరున ప్రతిష్ఠితమైన పురస్కారాన్ని గత యాభై ఏళ్ల నుంచి కథా, రచన రంగంలో తనదైన ముద్రవేసిన ఓరుగల్లుకు చెందిన ప్రము ఖ కవి, రచయిత రామా చంద్రమౌళికి ప్రదానం చేయడం ఆనందంగా ఉన్నద ని పేర్కొన్నారు.
ఉగాది సంబురాల్లో భా గంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరి కా, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 12, 13వ తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే సాహిత్య సంబురాలను రామా చంద్రమౌళికి పురస్కారం అం దజేస్తారని వారు వివరించారు. అలాగే 13న కవుల సుదీర్ఘ కవి సమ్మేళనం, అష్ఠావదానం, పలు పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని, సభకు కవులు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.