నల్లబెల్లి, మే 07 : ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం నల్లబెల్లి మండల అధ్యక్షుడు నీలా వెంకటేశ్వర్లు గుప్తా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. పురోహితులు శ్రీనివాస్ శర్మ పూజా ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేసి సకల దేవతలను ఆవాహనం చేయించిన అనంతరం వాసవి మాతకు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి గందె శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడారు.
పాడిపంటలు, వ్యాపార వాణిజ్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా కొనసాగాలని వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రవాదాన్ని నిర్మూలించి ప్రశాంత ప్రపంచం విలసిల్లాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి గంగిశెట్టి నాగభూషణ్, కోశాధికారి మురికి మనోహర్రావు, పట్టణ సంఘం అధ్యక్షుడు మురికి రవీందర్, వాసవి మహిళ మండల అధ్యక్షురాలు గందె శ్రీలత, సభ్యులు గంగిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పుల్లూరి శివప్రసాద్, బచ్చు రాజయ్య, నీల రమాదేవి, మురికి సంధ్య, గంగిశెట్టి విజయలక్ష్మి, రమాదేవి, రామంచన లక్ష్మి, బచ్చు జ్యోతి, స్వరాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.