వరంగల్ : వరంగల్ జిల్లా నుంచి హజ్ యాత్ర చేయనున్న యాత్రికులకు వరంగల్ ఐఎంఏ హాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించారు. మంగళవారం వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో బయో ఓరల్ పోలియో వ్యాక్సిన్, క్వార్టరీ వాలెంటర్ మెనిగోకకల్ వ్యాక్సిన్, సీజనల్ ఇన్ఫ్లూజా వ్యాక్సిన్ వేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిధిలోని 53 మందితో పాటుగా భూపాలపల్లికి చెందిన మరో ఇద్దరితో కలిపి మొత్తం 55 మందకి యాత్రికులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. హజ్ యాత్రికులతో పాటుగా విదేశీ ప్రయాణాలు చేసే ప్రతి యాత్రికుడు ఆయా దేశాలకు సంబందించిన నియమ, నిబంధనలను అనుసరించి వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, డాక్టర్ జునైద్ ఖాన్, డాక్టర్ కిరణ్, డాక్టర్ భరత్‌కుమార్, డాక్టర్ రమేల తన్వీర్, హజ్ యాత్రికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సర్వర్ ఘాజీ, కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.