పరకాల, సెప్టెంబర్ 11 : మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడంలేదని, అం దువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడుతున్నారని పరకాల మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువా రం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ని ఎఫ్‌జే గార్డెన్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వ్యవసాయంలో కష్టాలు ఎదురవుతాయని ఆనాడే చెప్పామని, ఇప్పుడు రైతులు అనుభవిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేని యూరియా కొ రత ఇప్పుడెందుకు వచ్చిందని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్పాలన్నారు.
కాంగ్రె స్ ప్రభుత్వం రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని కష్టాల పాలు చేస్తున్నదని, వ్యవసాయం చేయాల్సిన అన్నదాతలు రాత్రి, పగలు తేడా లేకుండా సొసైటీల వద్ద పడిగాపులుగాస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదన్నారు. యూరియా ఏదని అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రైతులను కించపరిచేలా మాట్లాడుతూ సమస్యను పకదోవ ప ట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎ ద్దేవా చేశారు. యూరియా కోసం చిన్న పిల్లలను ఎత్తుకొని తల్లులు, వృద్ధ మహిళలు క్యూల్లో నిలబడు తూ గోసపడుతున్నారని, వారి ఉ సురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకుతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నదని విమర్శించా రు. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధా లు చెబుతూనే అదే ప్రాజెక్ట్ నుంచి నీళ్లను ఇతర ప్రాంతాలకు ఎట్లా తరలిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఘోష్ కమిషన్‌తో కాంగ్రెస్ పార్టీ తప్పుడు రిపోర్ట్ తయారు చే యించి, దాని ఆధారంగా కేసీఆర్‌పై సీబీఐ విచారణకు నిర్ణయించడం దుర్మార్గపు చర్య అని ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా రైతులకు యూరియా అందే లా చూస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు నేతాని శ్రీనివాస్‌రెడ్డి, బీ సారంగపాణి, నిప్పాని సత్యనారాయణ, చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, గండు రాము, దురిశెట్టి చంద్రమౌళి, గంట కళావతి, శనిగరపు నవీన్, నందికొండ జైపాల్‌రెడ్డి, అడప రాము, బండి రమేశ్ పాల్గొన్నారు.