దుగ్గొండి, జూలై 20: వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండవలసిన రైతన్నలు యురియా బస్తాల కోసం సొసైటీల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం ఏడు గంటల నుండి యూరియా బస్తాల కొరకు వేచి చూస్తున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షంనికి పత్తి, మొక్కజొన్న పంటలకు ఎరువులు వేసుకోవాలని రైతులు భారీగా సొసైటీ గోదాం వద్దకు చేరుకున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు చొప్పున మాత్రమే ఇస్తామని సొసైటీ సిబ్బంది తెలిపారు. ఖరీఫ్ సీజన్లో పంటలకు సరిపడా యూరియా నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిoదని పలువురు రైతులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.