వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ ఎంపీటీసీ సీనపెల్లి రజిత వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.