హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 30: బసవజయంతి ఒక హిందూ పండుగ దీన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ప్రధానంగా లింగాయతులు బసవన్న పుట్టినరోజును జరుపుకుంటారని, బసవేశ్వర జయంతి సందర్భంగా ప్రజలు స్వీట్లు పంచుతూ దేవాలయాలను సందర్శిస్తారని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్శర్మ తెలిపారు.
బుధవారం వేయిస్తంభాల దేవాలయం ఎదుట బీసీ సంక్షేమ శాఖ అధికారి, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ, వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండవరం విదుమౌళి, మఠం బసవయ్య, దుర్గం సమ్మయ్య, వీర సోమయ్య, ఉప్పు భాస్కర్, రమేష్, గౌరీశంకర్, శైలేష్ ప్రసాద్, రాకేష్ ఉన్నారు.