హనుమకొండ, నవంబర్ 17: ఈ నెల 23న స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ జన్మదిన సందర్భంగా ప్రతిజ్ఞ దివస్ పేరు మీద వారం రోజుల పాటు వివిధ మాద్యమంలో అనేక ప్రోగ్రామ్స్జరిపేందుకు సిద్ధమైన స్వేరోస్ ప్రతినిధులు సోమవారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్ వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు.
సేవా దినోత్సవం, జ్ఞాన జ్యోతి దినోత్సవం, ప్రేరణ దినోత్సవం, స్వేరోవిందు, పర్యావరణ దినోత్సవం, నాయకత్వ దినోత్సవం, ప్రతిజ్ఞ దినోత్సవం మాధ్యమంలో ప్రతిజ్ఞ దివస్ చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ తెలంగాణ రాష్ర్ట చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు వీరయ్య, ఎస్ఆర్పీలు, స్వేరోస్ రాష్ర్ట నాయకులు, స్వేరోస్ జిల్లా నాయకులు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి విభాగం తదితరులు పాల్గొన్నారు.