అకాల వర్షం.. ఆగమాగం
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడగా, మిగతా చోట్ల తేలికపాటి వాన కురిసింది.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన
- జనగామలో ఈదురు గాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
- పలు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడగా, మిగతా చోట్ల తేలికపాటి వాన కురిసింది. జనగామ జిల్లాలో ఈదురు గాలులతో వర్షం కురవగా, జనగామ వ్యవసాయ మార్కె ట్, స్టేషన్ఘన్పూర్ మండలం పాంనూర్, రంగరాయగూడెం, నర్మెట మండలం వెల్దండ, హన్మంతాపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాల్లో కాంటాలైన ధాన్యం బస్తాలు తడిసిపోగా, కుప్పలు పోసిన వడ్లు కొట్టుకుపోయాయి.
అలాగే పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. జనగామ మండలం శామీర్పేట, కమలాపూర్ మండలం ఉప్పులపల్లిలో పిడుగుపాటుకు గేదె, ఆవు మృతి చెందాయి. కాగా, జనగామ వ్యవసాయ మార్కెట్ సహా కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసి తరలింపునకు నోచుకోకుండా తడిసిన ధాన్యం బస్తాలను కొర్రీలు లేకుండా మిల్లుల్లో దిగుమతి చేసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

