ఖిలావరంగల్: వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ఓ ప్రయాణికి కిందపడి మృతి చెందిన సంఘటన గురువారం ఎల్గూరు రైల్వే స్టేషన్ యార్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే వరంగల్ జీఆర్పీ సిఐ సురేందర్ తెలిపిన కథనం ప్రకారం. ఏలూరు రైల్వే స్టేషన్ యార్డులోని హోమ్ సిగ్నల్ వద్ద సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి వేగంగా వెళుతున్న గుడ్డు తెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలకు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన చాయ రంగు, గుండ్రని ముఖం కలిగిన గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్, బ్రౌన్ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. అలాగే వీపుపై పుట్టుమచ్చ ఉంది.
మృతుడి వద్ద కాజీపేట నుంచి నెక్కొండ రైల్వే స్టేషన్ వరకు కొనుగోలు చేసిన సాధారణ టికెట్ మినహా ఎలాంటి ఆధారాలు లభించలేదు. వరంగల్ రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కె భాస్కర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసినవారు ఎంజీఎం దావాఖాన మార్చురీలో గాని లేదా వరంగల్ రైల్వేస్టేషన్లోని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ పేర్కొన్నారు.