హనుమకొండ, సెప్టెంబర్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. బుధవారం హనుమకొండ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులందరూ హైదరాబాద్‌లో నిరాహారదీక్ష చేస్తున్న అశోక్‌కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అశోక్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి దీక్ష విరమింపజేయాలన్నారు. వెంటనే ప్రధాన డిమాండ్లన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.