హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 8: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-14 ఇయర్స్బాలుర బాక్సింగ్ ఎంపికలు ఎస్జిఎఫ్ సెక్రెటరీ ప్రశాంత్‌కుమార్ అధ్యక్షతన హనుమకొండ బాక్సింగ్ హాల్లో ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు భోగి సుధాకర్ పాల్గొని క్రీడాకారులు ఉత్తమ నైపుణ్యాన్ని కనబరచాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీవైఎస్వో సిహెచ్.రఘు, బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ పెద్దమ్మ నరసింహారాములు, స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ మంచాల స్వామిచరణ్, పిఎస్ హెచ్ఎం శోభారాణి, కన్వీనర్ శీలం పార్థసారథి, ఎక్స్ ఆర్మీ కోచ్ శీలం నరేంద్రదేవ్, ఎస్జిఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ రాయికంటి సుభాష్‌కుమార్, బాక్సింగ్ అఫీషియల్స్ శాంసన్, జీవన్, రమేష్ పాల్గొన్నారు.