రఘునాథపల్లి, నవంబర్ 16 : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం.. నిడిగొండ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఇసుక లారీ పార్ చేసి ఉంది. ఆర్టీసీ రాజధాని ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండ నుంచి హైదరాబాద్కు 16 మందితో వెళ్తూ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ దోమలగూడకు చెందిన పులంపరి ఓంప్రకాశ్ (75), హనుమకొండ బాలసముద్రానికి చెందిన నవజీత్ సింగ్ (48) అకడికకడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జనగామ ఏరియా వైద్యశాలకు, మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్యాదవ్ తెలిపారు.