కొడకండ్ల, జనవరి 10 : జనగామ-సూర్యాపేట జాతీ య రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం ఐచర్ వాహనాన్ని తిరుమలగిరి వైపు వెళ్తున్న తుఫాన్ వా హనం ఢీకొనగా ఒకే కుటుంబానికి చెం దిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెంద గా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరా త్రి కొడకండ్ల మండలంలోని మైదాం చెరువుతండా వద్ద చోటుచేసుకుంది.
సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన పేరాల వెంకన్న(45), పేరాల జ్యోతి(35)తో పాటు మరో తొమ్మిది మంది జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు. తిరుగు ప్ర యాణంలో మైదాం చెరువుతండా వద్ద జాతీయ రహదారిపై నిలిపిన డీసీఎం వాహనాన్ని వీరి వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న పేరా ల వెంకన్న, పేరాల జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు.
వీరు బావమరదళ్లు. పేరాల ఉషయ్య, పేరాల లక్ష్మి, పేరాల లావణ్య, పేరాల ఉప్పలమ్మ, పేరాల ముత్యాలు, వం గూరి నర్సమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబంతో పాటు బంధువులని తెలిసింది. క్షతగాత్రులను జనగామ ప్రభుత్వ దవాఖాన, వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్కు తరలించారు. కాగా రాత్రి కావడంతోనే నిలిపి ఉన్న ఐచర్ వాహనం సరిగా కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.