రఘునాథపల్లి నవంబర్1: మండలంలోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై గోవర్ధనగిరి బస్టాండ్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పండుగ పూట వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవర్ధనగిరి గ్రామానికి చెందిన సంపత్ నారాయణరెడ్డి(60), లింగాలఘనపురం మండలంలోని నవాబుపేటకు చెందిన కడార్ల రవీందర్(59) గోపాలస్వామిగుట్ట సమీపంలోని మహేశ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్ మిల్లులో పనిచేస్తున్నారు.
గురువారం పనులు ముగించుకొని సాయంత్రం టీవీఎస్ బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఈ క్రమం లో హనుమకొం డ నుంచి హైదరా బాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు వీరి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అకడికకడే మృతి చెందారు. కారు యూ టర్న్ తీసుకొని తిరిగి కాజీపేట వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఎల్అండ్టీ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వెలగకపోవడంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ఎన్‌హెచ్ అధికారులు లైటింగ్‌ను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.