నర్సంపేటరూరల్, నవంబర్24: ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగుర్లపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పనిముట్లు కేంద్రంలో సబ్సిడీపై అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మండల మాజీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుతోట కుమారస్వామి, నాయకులు మచ్చిక రవితేజగౌడ్, రమేశ్, రాజు పాల్గొన్నారు.