కాజీపేట, జులై 8: రోడ్లపై ఆటోలు నడిపే ప్రతి ఆటో డ్రైవర్ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ డీసీపీ రావెళ్ల ప్రభాకర్ రావు సూచించారు. కాజీపేట పట్టణంలోని ప్యారడైస్ ఫంక్షన్ హాల్లో స్థానిక ట్రాఫిక్ సీఐ వెంకన్న అధ్యక్షతన నగరంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రయాణికులను భద్రంగా గమ్యం చేర్చాలన్నారు. ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్లు మర్యాదగా ఉండాలని సూచించారు.
ఆటో డ్రైవర్లు ఇష్ట రాజ్యంగా రోడ్లపై ఆటోలను నిలపరాదని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన అడ్డాలలోనే నిలపాలన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ వాహన కాగితాలతో పాటు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండడంతో పాటు, యూనిఫాం తప్ప కుండా ధరించాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసుల కుసమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ధార సూరి, రాంబాబు, అంజద్, శ్రావణ్, వినోద్, రహీం, చందు, జోషి, యాకుబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.