వాజేడు, జూలై 14 : మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు ఆదివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.
జలపాతం అందాలను వీక్షించి వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు. జలపాతం ముందు భాగంలోని స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు.