హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 27 : దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువ త అవగాహన పెంచుకుని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్దేశించిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ యువ సంగం’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుంచి 45 మందితో కూడిన విద్యార్థుల బృందం ఐఐటీ రూరీకి బయలుదేరింది. యువ సంగం ఫేజ్-2 కింద ఈ కార్యక్రమానికి వరంగల్ ఎన్ఐటీ, ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఎఐ బిజినెస్ సూల్, విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సహా తెలంగాణలోని ఇతర ప్రముఖ హెచ్ఈఐల నుంచి 45 మంది విద్యార్థులు ఐఐటీ రూరీకి బయలుదేరినట్లు వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఈ యాత్రకు వరంగల్ నిట్ నోడల్ ఇన్స్టిట్యూట్గా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రాంత సంస్కృతీసంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ప్రతినిధి స భ్యులు ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈ ప్రాం తంలో పర్యటిస్తుందన్నారు. విద్యార్థులతో పాటు నలుగురు అధ్యాపకులు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నట్లు తెలిపారు. కాగా, ఈ పర్యటనను వరంగల్ నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రముఖులతో సమావేశం.. విభిన్న సంసృతులపై అవగాహన..
ఈ పర్యటనతో రెండు రాష్ట్రాల మధ్య సంసృతీసంప్రదాయలు, ఆలోచనా విధానాలు, ఆవిషరణలపై పరస్పరం అవగాహన పెంచుకోవడం, ఉత్తమమైన విధానాలను అలవరుచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. పర్యాటకం, సంప్రదాయం, పురోగతి, సాంకేతికత, పరస్పర సంబంధాలను ప్రోత్సహించుకోవడం కూడా ఎజెండా లో భాగంగా ఈ పర్యటన సాగుతుందన్నారు.
చారిత్రక ప్రదేశాల సందర్శన..
విద్యార్థులు టైడ్స్ ఇంక్యుబేటర్, బయోనెస్ట్ ఇంక్యుబేటర్, టింకరింగ్ ల్యాబ్, రాక్ మ్యూజియమ్‌ను కూడా సందర్శించనున్నారు. అలాగే నైనిటాల్, హరిద్వార్, రిషికేశ్ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
విద్యార్థుల ఆలోచనలకు,
లక్ష్యాలకు ఒక రూపం ఈ పర్యటన..
వరంగల్ నిట్‌కు చెందిన యువసంగం సీజన్-2 నోడల్ ఆఫీసర్ బీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వి ద్యార్థులు భారతదేశ భవిష్యత్ ఆవిషర్తలు, నా యకులని, ఈ క్రమంలో వారు దేశ వారసత్వం, సంసృతి, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం, స్థానిక సంఘాలను అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం కీలకమన్నారు. విద్యార్థులు ఉత్తరాఖండ్ చరిత్ర, అకడి ప్రజల జీవన విధానాలు, సంస్కృతి, ఆహారం, విలువలను దగ్గరగా చూసి వాటిని అనుభూతి చెందుతారన్నారు. మే 4న ఈ పర్యటన ముగుస్తుందన్నారు.
సంసృతిని పరిచయం చేయడమే ముఖ్యఉద్దేశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆలోచనే యువ సంఘం, యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమమని, ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్ ద్వారా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల యువతకు భారతదేశ సంస్కృతి, విలువలను పరిచయం చేయడం ముఖ్య ఉద్దే శమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువత అ పారమైన ప్రతిభ, ప్రపంచ విజ్ఞానం, సృజనాత్మకత, ఆవిషరణల స్ఫూర్తిని మాత్రమే కాకుండా దేశ మానవీయతత్వాన్ని ప్రతిబింబించే సాంసృతిక విలువలను పునఃసమీక్షించే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఫేజ్-1తో అద్భుతమైన ఫలితాలు..
ఫిబ్రవరిలో ప్రారంభించిన యువ సంగమం మొదటిదశ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఫేజ్-2ను ప్రారంభించారు. మొదటి దశలో 1200 మంది యువకులు పాల్గొని 22 రాష్ట్రాలను సందర్శించారు. 29 ప్రత్యేక పర్యటనల ద్వారా ఈశాన్య భారత గొప్ప సంస్కృతి, వారసత్వం, వైవిధ్యాన్ని బహిర్గతం చేసేలా గత ఫిబ్రవరి, మార్చిలో సాగింది.
ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్ యువ సంగమం
ఈశాన్య రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు చెం దిన యువత ఇతర రాష్ట్రాల చరిత్ర, జీవనశైలి లాంటి అంశాలపై అవగాహన పెంచుకుని, అకడి ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా తమ ఉనికిని, పరిధులను విస్తరించుకోవాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఒక చొరవే ఈ ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్ యువసంగమం. ఈ కార్యక్రమం యువతకు టూర్లను నిర్వహించడంపై దృష్టి పెడుతుంది. ఈ పర్యటనలో భాగంగా యువత పర్యాటకం, సంప్రదాయాలు, ప్రగతి, టెక్నాలజీ, వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అనుసంధానం వంటి ఐదు విస్తృత రంగాలపై అపారమైన అనుభవాలను పొందుతారు.
వరంగల్ నిట్ డైరెక్టర్ బాధ్యతలు
స్వీకరించిన ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి
హనుమకొండ చౌరస్తా : వరంగల్ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి బాధ్యతలు తీసుకున్నారు. రిజిస్ట్రార్ ఎస్ గోవర్ధన్‌రావు సమక్షంలో ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వరంగల్ కొత్త డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2017లో డైరెక్టర్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు రాయపూర్ నిట్ డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లనున్నారు. నూతనంగా వరంగల్ నిట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ బిద్యాధర్ గోవాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) డీన్ (రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఐఐటీ గోవాలో ప్రొఫెసర్‌గా (హెచ్ఏజీ) చేరడానికి ముందు, ఆయన 13 ఏండ్లు నిట్ రూరెలాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 3 పుస్తకాలు, 12 పుస్తక అధ్యాయాలను రచించారు. 3 పేటెంట్లను ప్రచురించారు. 40 హెచ్-ఇండెక్స్‌తో ప్రసిద్ధ పత్రికల్లో 160 పేపర్లను ప్రచురించారు. ఐఎన్‌ఏఈ (ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్), ఐఈటీ(ది ఇని స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ) ఫెలో, సీనియర్ సభ్యుడు (ఐఈఈఈ). తన రీసెర్చ్ ద్వారా ప్రపంచంలోని టాప్ 2 శాతం శాస్త్రవేత్తలను అందుకున్నాడు. ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి 2013లో సమంత చంద్రశేఖర్ అవార్డు, నిట్ రూరెలా అలుమ్ని అవార్డు రీసెర్చ్-2019, న్యూటన్ ఫెలోషిప్, రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ యూకే లభించాయి.
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా
తీర్చిదిద్దాం..
నూతనంగా నియమితులైన డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ వరంగల్ నిట్ ను మొదటి ఎంపిక క్యాంపస్‌గా మార్చడానికి అధ్యాపకులు, విద్యార్థుల సాయంతో పరిశోధన, ఆవిషరణలను మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరంగల్ ఎన్ఐటీని దేశంలోనే అత్యుత్తమ ఇనిస్టిట్యూట్గాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.