హనుమకొండ చౌరస్తా, మార్చి 29 : శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు.
శనివారం పండుగకు కావాల్సిన మామిడి కాయలు, ఆకులు, వేప పూవు, పచ్చడి కుండలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో నగరంలోని హనుమకొండ చౌరస్తా, టైలర్స్ స్ట్రీట్ సందడిగా మారి కిక్కిరిసిపోయాయి.