నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 6 : గణపతి నవరాత్రోత్సవాలకు ఊరూవాడా సిద్ధమైంది. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కొలువయ్యే వేళ రానే వచ్చింది. నేడు శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణనాథులు కొలువుదీరనుండగా తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు, ప్రత్యేక ఆలంకారాలు, భక్తి గీతాలతో మండపాల వద్ద సందడి నెలకొం ది. ఇందుకోసం వారం ముందునుంచే నిర్వాహకులు మండపాలు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు, డెకరేషన్స్తో అలంకరించి సిద్ధం చేశా రు. ఈ సందర్భంగా విగ్రహాలు, పూజ సామగ్రి కొనుగోళ్లతో జిల్లాకేంద్రాలు, పట్టణాల్లోని మార్కెట్లన్నీ కిటకిటలాడాయి.
గణపతిని తొలుత ఆరాధించడం వల్ల చేపట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడమే కాక విజయంతో పాటు గమ్యాన్ని, లక్ష్యా న్ని పొందవచ్చనేది ప్రజల విశ్వాసం. విఘ్నాలు తొలగించే దేవుణ్ణి కొలిచేందుకు ప్రకృతికి ఎన్నో విఘ్నాలు కలిగిస్తున్నాం. అంతేకాదు వాటిని నీటి లో నిమజ్జనం చేయడం తో నీరు కలుషితమవుతోంది.
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మట్టి విగ్రహాలతో పాటు పూజించిన పత్రాలను నీటిలో వేయ డం వల్ల విగ్రహం మెల్లగా కరిగి నీటిలో కలిసిపోతుంది. పత్రాలన్నీ ఆయుర్వేద, ఔషధ గు ణాలు కలిగినవే. అవి 23గంటల వ్యవధి తర్వా త వాటిలోని ఔషధ గుణాలు, ఆల్కలాయిడ్స్ ను ఆ జలంలోకి వదిలేస్తాయి. బ్యాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సీజన్ శాతా న్ని పెంచుతాయి. ఫలితంగా నీరు శుద్ధి అవుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.