వెంకటాపూర్, ఏప్రిల్ 7: మండలంలోని రామకృష్ణాపూర్ పరిధి మామిడి తోటకు సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఘటనలో సుమా రు 2వేలకు పైగా మామిడి చెట్లు కాలిపోయాయని రైతు తిరుపతిరావు తెలిపారు. సుమారు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు.
కొంతమంది వ్యక్తులు మామిడితోట వైపు వచ్చి వెళ్లారని, తర్వాత మంటలు ఒక వైపున కనిపించడంతో గ్రామస్తులను పిలుచుకొని వచ్చి ఆర్పేప్రయత్నం చేయగా అప్పటికే మంటలు పూర్తిగా వ్యా పించి తోట పూర్తిగా కాలిపోయిందన్నారు. రెండు వేలకు పైగా చెట్లతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. చేతికి వచ్చిన పంట అగ్నికి ఆహుతి అవడంతో రైతు విలపిస్తున్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు తెలిపారు. బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.