శాయంపేట/బయ్యారం/సంగెం, ఆగస్టు 21: కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. శాయంపేటకు చెందిన వంగరి రాజు-విజయ దంపతుల ఐదేళ్ల కుమారుడు శివసాయి బాలికల హైస్కూ ల్ ఎదుట పిల్లలతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్నా డు. ఈ క్రమంలో కుక్కలు శివసాయిపై దాడి చేయ గా, ఎడమ చేయికి గాయాలయ్యాయి.
వెంట నే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం మధ్యాహ్నం వేళ అవే కుక్కలు పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్‌పై దాడి చేశాయి. అదేవిధంగా బయ్యారం మండలం గంధంపల్లిలో షేక్ యూసఫ్-రిజ్వరా దంపతుల మూడేండ్ల చిన్నా రి సుఫియాన్‌కు తల్లి ఇంటి ముందు అన్నం తినిపిస్తోంది. ఈ క్రమంలో వీధి కుక్క ఒక్కసారిగా వచ్చి చిన్నారి మీద పడి గొంతు పట్టేసింది. దీంతో తల్లి కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న బాలుడి తండ్రి యూసఫ్ వచ్చి కుక్క నుంచి కొడుకును కాపాడాడు.
ఈ క్రమంలోనే యూసఫ్ కాలు పట్టి కుక్క గాయం చేసింది. చిన్నారికి తీవ్ర గాయం కావడంతో రాత్రికి రాత్రే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. సంగెం మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన వేల్పుల అనిల్ కుమారుడు విలోహిత్ 3వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం తన సోదరితో కలిసి వస్తుండగా వీధి కుక్కలు విలోహిత్పై దాడి చేయడం తో కాలుకు, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. చికి త్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు.