నర్సంపేట రూరల్, డిసెంబర్ 12 : ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గురిజాల గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు ఆదివారం పరిసమాప్తమయ్యాయి. ఐదు రోజులుగా ఆగమ నిశారద శతాధిక ప్రతిష్ఠాచార్య మార్తి శివామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో పలువురు వేద పండితుల సమక్షంలో ప్రతిష్టాపన వేడుకలు నియమ నిష్ఠలతో కొనసాగాయి. చివరి రోజు వేడుకలకు ఎమ్మెల్యే పెద్ది హాజరవ్వగా, వేద పండితులు పూర్వకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత ఎమ్మెల్యే దేవాలయ ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రెండు పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని వేడుకున్నానన్నారు. ఆలయంలో కమిటీ హాల్ నిర్మాణానికి రూ.25లక్ష ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారు శ్రీలత, గురిజాల పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్‌గౌడ్, న్యాయవాది మోటూరి రవి, గొడిశాల సదానందంగౌడ్, బండారు రమేశ్, దేవాలయ కమిటీ చైర్మన్ నీలం మల్లయ్య, గౌరవ అధ్యక్షుడు గుర్రం నర్సింగం, డైరెక్టర్లు గజ్జి రాజు, గడ్డం నర్సయ్య, గుర్రం అచ్చయ్య, గొడిశాల సంపత్, డక్క శ్రీనివాస్, గడ్డం ఆంజనేయులు, అల్లి రవి, పోటు రాయపురెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.