వీఆర్ఏల రెగ్యులరైజ్‌కు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై చిరుద్యోగుల్లో సంబురం అంబరాన్నంటింది. పెద్ద మనస్సుతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని వారు హర్షం వ్యక్తచేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. పలుచోట్ల పటాకులు కాల్చి సంతోషాన్ని వెలిబుచ్చారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. అలాగే విద్యార్హతలను బట్టి వీఆర్ఏలను ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా రెగ్యులర్ పేస్కేల్ వర్తింపజేయాలని ఆదేశాలు ఇచ్చినందు కు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌లో వేలాది మందికి ప్రయోజనం చేకూరనున్నది.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 19
కేసముద్రం : వీఆర్ఏల శ్రమను సీఎం కేసీఆర్ గుర్తించి రెగ్యులరైజ్ చేయడం సంతోషంగా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలతో ఇబ్బదులు పడ్డాం. గ్రామంలో ఏ ఇతర శాఖ అధికారి వచ్చినా వీఆర్ఏలు అందుబాటులో ఉండేవారు. శ్రమకు తగిన వేతనం రాక పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. శ్రమను గుర్తించి పేస్కేల్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించిన కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– చైతన్య, వీఆర్ఏ
కేసముద్రం : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. గ్రామాల్లో అన్ని శాఖల అధికారులకు తోడ్పాటు అందించే వీఆర్ఏలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వీఆర్ఏల శ్రమను గుర్తించి పదోన్నతలు కల్పించడం నిజంగా సాహసోపేత నిర్ణయం. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మా కుటుంబాలకు భరోసా కలిగింది.
– రమాదేవి, వీఆర్ఏ
కేసముద్రం : మా నాన్న 35 ఏళ్ల పాటు షేక్ సింద్(సుంకరి)గా, తహసీల్‌లోనూ పని చేశారు. వేతనాలు త క్కువగా ఉన్నప్పటికీ పనులు చేస్తూ కష్టపడి చదివించారు. వారసుడిగా నేను 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. కేసీ ఆర్ ప్రభుత్వం 60 ఏళ్లు నిండిన వీఆర్ ఏల వారసులకు కూడా రెగ్యులరైజ్ విధానంలో విద్యార్హతలను బట్టి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలా గొప్ప నిర్ణయాలు తీసుకోలేదు.
– ప్రభాకర్, వీఆర్ఏ