ఫ్రీ బస్సు సౌకర్యంతో హనుమకొండ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగి దొంగలు రెచ్చిపో తున్నారు. ప్రయాణికుల్లో కలిసిపోయి క్షణాల్లో మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు, బ్యాగులు మాయం చేస్తున్నారు. బస్సుల్లో సైతం బ్యాగులు మాయం చేయడంతో పాటు పండుగ లు, జాతరల సమయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్‌లో సరిపడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టమవుతున్నద ని, బస్సెక్కేటప్పుడు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ బస్‌స్టేషన్ అతిపెద్దది. వరంగల్ రీజియన్‌లోని వరంగల్ 1, వరంగల్2, హనుమకొండ, భూపాలప ల్లి, పరకాల, తొర్రూరు, నర్సంపేట, జనగామ, మహబూబాబాద్ డిపోలతోపాటు ఇతర జిల్లాలకు చెందిన ఆర్టీసీ బస్సులు 3 నుంచి 4వేల వరకు నడుస్తుంటాయి. రోజూ సగటున లక్ష నుంచి లక్షా 20వేల మధ్య ప్ర యాణికులు ఇక్కడి నుంచే హైదరాబాద్, బెం గళూరు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ తదితర దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ఫ్రీ బస్సు సౌకర్యంతో హనుమకొండ బస్‌స్టేషన్‌లో రద్దీ విపరీతంగా పెరిగింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూస్తుంటారు. బస్సులు పాయింట్ వద్దకు రాగానే సీట్ల కోసం ఎగబడంతో దొంగలు ప్రయాణికుల్లో కలిసిపోయి చోరీలకు పాల్పడుతున్నా రు. అదేవిధంగా రీజీయన్ తొమ్మిది డిపోల నుంచి 82లగ్జరీ బస్సులు నడుస్తుండగా, ఇం దులో సుమారు 30 బస్సుల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. వీటిల్లో కూడా చోరీలు జరుగుతున్నా కెమెరా లు పనిచేయకపోవడంతో పోలీసులు దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన చోరీల్లో మహిళా దొంగలు మాస్కులు, స్కార్ప్‌లు కట్టుకొని బస్సు ఎక్కే క్రమంలో వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న గోల్డ్ చైన్లు కొట్టే స్తున్నట్లు సీసీ పుటేజీల్లో తేలింది.
హనుమకొండ బస్‌స్టేషన్‌లో చోరీలు జరగకుండా మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. రద్దీ పెరగడంతో చోరీలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న యూసఫ్‌గూడకు చెందిన యువతి హైదరాబాద్ వెళ్లడానికి హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సు ఎక్కి లోప ల కూర్చున్న కొద్దిసేపటికే బ్యాగ్ మాయమైంది. అందులో 6.5 తులాల గోల్డ్ ఉంది. మార్చిలో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరకు చెందిన మహిళ బస్సు ఎక్కుతుండగా మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడు, గోల్డ్ చైన్‌ను గుర్తు తెలియ ని వ్యక్తి కొట్టేశాడు. జూన్9న నల్లబెల్లి మండలానికి చెందిన యువతి హైదరాబాద్ వెళ్లడానికి బస్సులో ఎక్కిన కొద్దిసేపటికే మెడలో ఉన్న 12 గ్రాముల గోల్డ్‌చైన్ చూసుకుంటే లేదు. ఈ కేసులో పోలీసులు దొంగను గుర్తించి గోల్డ్ చైన్ రికవరీ చేశారు. ఈ నెల 7న దుగ్గొండి మండలానికి చెందిన తల్లీ, కూతు రు ఉప్పల్ ఎక్స్‌రోడ్డులో వరంగల్1డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఎక్కి డ్రైవర్ వెనక సీట్లో కూర్చుని బ్యాగ్‌ను పైన పెట్టారు. హనుమకొండలో దిగిన తర్వాత బ్యాగులోని 9 తులాల గోల్డ్ చైన్లు చోరీకి గురయ్యాయి. 13న హుజూరాబాద్‌కు చెందిన మహిళ హైదరాబాద్‌లో కుమారుడి వద్దకు వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా మెడలోని రెండున్నర తులాల పుస్తెలతాడును దొంగలు ఎత్తుకెళ్లారు.
ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 15వరకు హనుమకొండ బస్‌స్టేషన్‌లో 14 చోరీలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ఏటూరునాగారం, మహబూబాబాద్, ఖమ్మం పాయింట్ల వద్ద ఎక్కువగా చోరీలు జరుగున్నాయి. ఆర్టీసీ అధికారులు 4 నుంచి 8 మెగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 2 మాత్రమే బిగించారు. అవి కూడా బస్‌స్టేషన్ లోపలే ఉన్నాయి. అన్ని పాయింట్ల వద్ద, బయటికి, లోపలికి వెళ్లే మార్గాల్లో కెమెరాలు లేకపోవడంతో చోరీ కేసుల్లో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.