మువ్వన్నెల రెపరెపలు
ఆకాశ వీధిన త్రివర్ణ పతాక సగర్వంగా రెపరెపలాడింది. జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ బీ గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.
- అంబరాన్నంటిన రిపబ్లిక్ డే వేడుకలు
- కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ బీ గోపి
- పోలీసుల గౌరవ వందనం స్వీకరణ
- స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
- ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ
- ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
- హాజరైన జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడే, ఈస్ట్ జోన్ డీసీపీ వెంటకలక్ష్మి
- వర్ధన్నపేట, నర్సంపేట, పోచమ్మమైదాన్‌లో త్రివర్ణ పతాకాలను ఎగురవేసిన ఎమ్మెల్యేలు అరూరి, పెద్ది, నన్నపునేని
ఆకాశ వీధిన త్రివర్ణ పతాక సగర్వంగా రెపరెపలాడింది. జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ బీ గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినితో కలిసి కలెక్టర్ ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. వర్ధన్నపేట, నర్సంపేట క్యాంపు కార్యాలయాలు, పోచమ్మమైదాన్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. అలాగే, జిల్లాలో ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో మువ్వన్నెల జెండాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు.
74వ గణతంత్ర వేడుకలు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఊరూరా.. వాడవాడలా.. త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్లు సంబురాలతో కళకళలాడాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించే పాటలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరీతులు కట్టిపడేశాయి. ఆయా చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్లు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లాల ప్రగతిని వివరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, వివిధ ప్రభుత్వ శాఖల్లో విశేష సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

