హనుమకొండ, సెప్టెంబర్ 29: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారిని మూలానక్షత్రం సరస్వతిదేవిగా అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని వీణతో అలంకరించి భక్తులు అందించిన వివిధ రకాల 5 వేల గాజులతో అమ్మవారిని అలంకరించి సరస్వతీదేవి నామాలతో అర్చన అనంతరం అమ్మవారికి దద్దోజన నివేదన సమర్పించారు. కలువపూలు, తెలుపురంగు చీరతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
యాగశాలలో సరస్వతీదేవి హోమం సుదర్శనదేవి హోమం నిర్వర్తించి అన్నప్రసాద వితరణలో శ్రీకాకుళం నుంచి వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చ కుడు గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్‌లు నిర్వహించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో తరలివచ్చి ఆడి పాడారు.